సింగీతం టీజర్‌... చూశారా?

May 02, 2026


img

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు గురించి కొత్తగా పరిచయం అవసరమే లేదు. ప్రస్తుతం ఆయన వయసు 94 ఏళ్ళు. ఈ వయసులో కూడా ఆయన దర్శకత్వంలో సినిమా తీయడం విశేషం. ఈ సినిమాకి పేరు ‘సింగ్..గీతం.’ దీని టీజర్‌ నిన్న విడుదలైంది. సినిమా జూన్‌ 11న విడుదల కాబోతోంది. ఇది 40 ఏళ్లనాటి తన కార్యకర్తలు, కథ అని ఆయన చెప్పుకున్నారు. 

ఈ సినిమాలో అయాన్, ఆహిల్య, షాలిని ముఖ్యపాత్రలు చేస్తున్నారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా ఈ సినిమా నిర్మిస్తుండటం మరో విశేషం. 

ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: అంకుర్ సి, పాటలు: శ్రీమణి చేశారు. 

ఈ సినిమాకి సింగీతం శ్రీనివాసరావు, గౌతమి చల్లగుళ్ళ, శశాంక్‌ చింతలపూడి, రత్న శ్రీకర్,  నంద కిషోర్ ఈమని, రాహుల్ వి రాజేశ్వర్ కలిసి కథ తయారు చేశారు.


Related Post

సినిమా స‌మీక్ష