శ్రీనివాస మంగాపురంలో... అల్లెల్లే అల్లెల్లే లిరికల్

April 30, 2026


img

సూపర్ స్టార్ కృష్ణ మనుమడు, మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి అల్లెల్లే అల్లెల్లే.. అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. శ్రీమణి వ్రాసిన ఈ పాటకి జీవి. ప్రకాష్ కుమార్‌ సంగీతం అందించి హరి ప్రియతో కలిసి పాడారు.  

అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతోనే అలనాటి అందాల నటి రవీనా టాండన్ కుమార్తె రాషా దడాని కూడా హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. కనుక హీరో, హీరోయిన్‌ ఇద్దరూ కొత్తవారేనన్న మాట! 

ఈ సినిమాలో ఇద్దరు సీనియర్ నటులు మోహన్ బాబు, నరేష్ నటిస్తున్నారు  స్వతంత్ర బాబు’ అనే ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: జీవి.ప్రకాష్ కుమార్‌, కెమెరా: ఆర్‌డీ రాజశేఖర్, ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు. 

ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై జెమిని కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.    


Related Post

సినిమా స‌మీక్ష