టీఆర్ఎస్‌ పార్టీ పేరుపై ఈసీకి పిర్యాదు

April 30, 2026


img

కల్వకుంట్ల కవిత ఇటీవల తన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్‌) అని ప్రకటించినప్పుడు, బీఆర్ఎస్‌ పార్టీ ఘాటుగా స్పందిస్తుందని అందరూ భావించారు. కానీ మొక్కుబడిగా స్పందించింది. అయితే ఆమె పార్టీకి ఆ పేరు రిజిస్టర్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్‌) అధ్యక్షుడు తుపాకుల బాలరంగం కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఓ లేఖ వ్రాశారు. 

దానిలో.. కల్వకుంట్ల కవిత పార్టీ పూర్తి పేరు వేరే అయినప్పటికీ ప్రచారంలో ‘టీఆర్ఎస్‌ పార్టీ’ అనే ఎక్కువగా వాడుతారు. దానినే ప్రజలు పరిగణనలోకి తీసుకుని ఓట్లు వేస్తారు. కానీ మా పార్టీ 2023లోనే ఆ పేరుని రిజిస్టర్ చేసుకొని అదే పేరుతో ఎన్నికలలో పోటీ చేసింది కూడా. కానీ రాష్ట్రంలో ఇప్పుడు ‘టీఆర్ఎస్‌’ పేరుతో రెండు పార్టీలున్నట్లయితే, ప్రజలు గందరగోళానికి గురవుతారు. రాజకీయంగా మేము నష్టపోతాము. కనుక ‘టీఆర్ఎస్‌’ పేరుతో కల్వకుంట్ల కవితకి పార్టీ రిజిస్ట్రేషన్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. 

కానీ కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఇటువంటి సమస్యలన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పార్టీలకు పేరు రిజిస్టర్ చేస్తుంటుంది. కనుక తుపాకుల బాలరంగం అభ్యంతరానని కేంద్ర ఎన్నికల కమీషన్‌ తిరస్కరించవచ్చు. 


Related Post