కేరళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. తెలుగులో ఆమెకి సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయినా తమిళ్, మలయాళంలో చేస్తూనే ఉన్నారు. నిర్మాతగా మారి కేయూరీ ప్రొడక్షన్స్ పేరుతో సినిమాలు తీసేందుకు సిద్దమవుతున్నారు కూడా.
ఇప్పుడు ఆమె వయసు 39 కనుక మీడియా ప్రతినిధులు ప్రతీసారి ఆమె పెళ్ళెప్పుడు అంటూ అడుగుతూనే ఉంటారు. ఇంతకాలం ఇప్పుడే కాదని జవాబు చెప్పేవారు. కానీ ఇటీవల అదే ప్రశ్నకు వేరే జవాబు చెప్పారు. “పెళ్ళి, పిల్లలు రెండు జీవితంలో భాగమే. కానీ పెళ్ళి చేసుకునే పిల్లలు కనాలని ఏమీ రూల్ లేదు. పిల్లలు కావాలనుకుంటే పెళ్ళి చేసుకోకుండా కూడా కనవచ్చు,” అని అన్నారు.
ఆమె అలాంటి ఆలోచన లేదా ప్రయత్నంలో ఉన్నందునే ఈ మాటన్నారా? ఏమో?