తెలంగాణలో మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వినిపించాయి. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ సంచలన ఆరోపణలు చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మా ఫోన్లు, మా ఇళ్ళ ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ అవుతున్నట్లు మా వద్ద బలైన సాక్ష్యాధారాలున్నాయి. దీని కోసం బెంగళూరు నుంచి ‘హ్యాకర్స్’ని రప్పించారు. మా కదలికలు, మా నాయకుల పార్టీ వ్యవహారాలపై నిఘా పెట్టడాన్ని మేము ఖండిస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏ ఒక్కరినీ విడిచిపెట్టబోము. మా ఫోన్లు హ్యాక్ చేయిస్తున్న పోలీస్ అధికారులు రిటైర్ అయినా కూడా పట్టుకొని తీసుకువచ్చి కేసులు నమోదు చేస్తాము,” అని హరీష్ రావు హెచ్చరించారు.
ఓ పక్క కేసీఆర్ హయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇంకా కొనసాగుతుండగానే, కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఇటువంటి సంచలన ఆరోపణ చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు ఇంకా స్పందించాలి ఉంది. వారి సమాధానం ఏవిధంగా ఉంటుందో తేలికగానే ఊహించుకోవచ్చు.

చట్టాన్ని అతిక్రమించి కొంతమంది ఐపీఎస్ అధికారులు
కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి
బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు, ఇండ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు.

రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
రేవంత్ రెడ్డి కాదు కదా ఎవ్వడూ మిమ్మల్ని కాపాడడు.

మీరు చేసిన… pic.twitter.com/HxQ2RPmgw1
— BRS Party (@BRSparty) April 28, 2026