సుభాష్ చంద్ర దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా చేసిన ‘గోదారి గట్టుపైన’ ట్రైలర్ సినిమా తప్పక చూడాలనిపించేలా చేసింది. ఈ సినిమా మే 8న విడుదల కాబోతోంది.
కనుక ట్రైలర్ వదిలి తమ పనైపోయిందని ఊరుకోలేదు. తాజాగా ఓ ప్రమో వదిలారు. అది చూసినప్పుడు సినిమా ప్రమోషన్స్ ఇంత సింపుల్‌గా ఈవిధంగా కూడా చేసుకోవచ్చా? అని అనిపించకమానదు. అవునో కాదో చూసి మీరే చెప్పండి.
గోదావరి జిల్లాలో సాగే ప్రేమ కథ నేపధ్యంలో అక్కడి పల్లెలను, ప్రజల జీవనశైలిని ఈ సినిమాతో దర్శకుడు సుభాష్ చంద్ర ఆవిష్కరించబోతున్నారని టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది.
ఈ సినిమాలో జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైల, దేవీ ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వివా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: సుభాష్ చంద్ర, సంగీతం: నాగ వంశీ, కెమెరా: సాయి సంతోష్, స్టంట్స్: కార్తిక్ డంగ్రి, ఎడిటింగ్: అనిల్ పాశాల చేశారు.
ఏసియన్ సినిమాస్ సమర్పణలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అభినవ్ రావు నిర్మించిన ఈ సినిమా మే 8న విడుదల కాబోతోంది.
సినిమాని జనంలోకి తీసుకెళ్లడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్లవి.
— Madhu.. (తెలుగు అమ్మాయి..) 🧡 (@Madhu_Urmila) April 25, 2026
అచ్చంగా ఓ కమర్షియల్ యాడ్ లా.. ప్రోమోని భలే కట్ చేశారు.
ప్రమోషన్ కూడా ఈ హాట్ సమ్మర్ లో.. కూల్ కూల్ గా అనిపిస్తోంది.#GidariGattuPaina pic.twitter.com/DIoKTndjIq