కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ చేసిన దేవర సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తీస్తున్నప్పుడే దానికి సీక్వెల్ ఉంటుందని కొరటాల చెప్పేశారు. కానీ ఆ తర్వాత జూ.ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి డ్రాగన్ మొదలుపెట్టేశారు. కనుక ఈలోగా దేవర-2 కథతో పాటు మరో కథ కూడా సిద్దం చేశారు. దానిని నందమూరి బాలకృష్ణకు వినిపించగా అయన వెంటనే ఓకే చెప్పేశారు.
ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అది చేస్తూనే కొరటాల శివతో సినిమా ప్రారంభించవచ్చని తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.
బాలయ్యతో సినిమా మొదలుపెడితే అది పూర్తవడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది. అప్పటికి జూ.ఎన్టీఆర్ ఫ్రీ అయిపోతే దేవర-2 మొదలుపెట్టే అవకాశం ఉంది. కానీ జూ.ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ పౌరాణిక సినిమాకి ఓకే చెప్పారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకటేష్ హీరోగా ఆదర్శ కుటుంబం పూర్తి చేస్తున్నారు. ఇలా దర్శకులు, హీరోలు వరుస సినిమాలతో లాక్ అయ్యి చాలా బిజీగా ఉన్నారు. కనుక ఒకరి వలన ఆలస్యం జరిగినా ఆ సినిమా వెనక్కుపోయి వేరే సినిమా మొదలుపెట్టాల్సి వస్తుంది.