రెండు రాష్ట్రాలలో భారీగా పోలింగ్

April 23, 2026


img

నేడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసనసభ (తొలిదశ) ఎన్నికలు జోరుగా సాగాయి. రెండు రాష్ట్రాలలో భారీగా ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడంతో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు తమిళనాడులో 82.24 శాతం, పశ్చిమ బెంగాల్లో 89.93 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. ఆ సమయానికి లైన్లో ఉన్నవారందరినీ ఓట్లు వేసేందుకు అనుమతిస్తారు. కనుక పోలింగ్ శాతం మరింత పెరుగుతుంది. 

ఈసారి తమిళనాడు ఎన్నికలలో కోలీవుడ్‌ నటుడు విజయ్‌ టివికే పార్టీతో పోటీ చేస్తుండటం వలన యువత భారీగా తరలివచ్చినట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్లో ఈసారి అధికార తృణమూల్ కాంగ్రెస్‌-బిజేపిల మద్య హోరాహోరీగా పోరు సాగినందున పోలింగ్ శాతం పెరిగి ఉండవచ్చు. 

ఈ నెల 29న పశ్చిమ బెంగాల్లో రెండో దశ పోలింగ్ ఉంది. కనుక అది పూర్తయ్యేవరకు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదని ఎన్నికల కమీషన్ ఆదేశించింది. కనుక అప్పటి వరకు వేచి చూడాల్సిందే. 


Related Post