కాంగ్రెస్ పార్టీ నుంచి 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి తెచ్చుకొని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించుకుంటే ఆ సంతోషం మూడు రోజులు కూడా లేకుండా చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.
నేడు అయన కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిశారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బిజేపి సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి స్వయంగా మల్లారెడ్డిని ప్రధాని మోడీకి పరిచయం చేశారు. ఆదాయపన్ను, ఈడీ కేసులు ఓ పక్క, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం, కాంగ్రెస్ పార్టీలో నో వేకెన్సీ బోర్డు ఉండటంతో బిజేపిలో చేరాలని మల్లారెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా కొడుకు, కోడలు, తమ కాలేజీల భవిష్యత్ కోసమే బిజేపి కవచం తొడుగుకోవడానికి మల్లారెడ్డి సిద్దపడుతున్నట్లు సమాచారం.
సకుటుంబ సమేతంగా ప్రధాని మోడీని కలవడం అయింది కనుక నేడో రేపో మంచి రోజు చూసుకొని కారు దిగి కాషాయ కండువా కప్పుకుంటారేమో?