కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్ర చేసిన ‘జైలర్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దాని సీక్వెల్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉండగానే దాని షూటింగ్ కూడా పూర్తి చేసేశారు.
షూటింగ్ పూర్తయిన సందర్భంగా రజనీకాంత్ యూనిట్ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. షూటింగ్ పూర్తవడంతో వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టి ఈ ఏడాది దసరా, దీపావళి పండుగ సీజన్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
జైలర్-2లో రజనీకాంత్‌కి జంటగా రమ్యకృష్ణ నటించగా, ఎస్.జే. సూర్య, యోగిబాబు, మీర్నా, అన్నారాజన్, జతిన్ సరనా సూరజ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ప్రముఖ నటులు మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మిథున్ చక్రవర్తి, వినాయకన్, విజయ్ సేతుపతి అతిధి పాత్రలలో నటించారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకత్వం చేశారు.