జూ.ఎన్టీఆర్‌-నీల్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే...

April 21, 2026


img

జూ.ఎన్టీఆర్‌-ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్‌లో చేస్తున్న ‘డ్రాగన్’ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా జూన్‌లో విడుదలవుతుందని చెప్పడంతో ఈ ఏడాది జూన్‌లోనే అని చాలా మంది అనుకుంటున్నారు. ఈ విషయం దర్శక నిర్మాతల దృష్టికి రావడంతో వారు స్పష్టత ఇస్తూ జూ.ఎన్టీఆర్‌-ప్రశాంత్ నీల్‌ కలిసి వచ్చే ఏడాది జూన్‌ 11న ప్రపంచాన్ని జయించడానికి వస్తున్నారంటూ ఓ పోస్టర్ వేశారు. 

ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌కి జోడీగా కన్నడ నటి రుక్మిణీ వసంత్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు కలిసి పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష