రవిబాబు రేజర్ ట్రైలర్‌… రక్తపాతమే!

April 18, 2026


img

ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత రవిబాబు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మే 8వ తేదీన విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో నేడు రేజర్ ట్రైలర్‌ వదిలారు. ఈ క్రైమ్‌, థ్రిల్లర్ సినిమాలో సంఘవిద్రోహ శక్తుల చేతిలో చిక్కిన బాధితులను ఆదుకునే ‘గార్డియన్ ఎంజల్’గా రవిబాబుని ట్రైలర్‌లో పరిచయం చేశారు. కనుక రక్తపాతం, వయోలెన్స్ కాస్త ఎక్కువగానే ఉంది. కానీ ఈ రెండే కాకుండా భావోద్వేగాలు కూడా ఉన్నాయని ట్రైలర్‌ చెపుతోంది. 

సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రవిబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ రాజేష్, కెమెరా: చరణ్ మాధవనేని చేశారు.

Trailer Link: https://youtu.be/axOJQPvxYlc?si=KPV8hpyTmUEJcurz


Related Post

సినిమా స‌మీక్ష