విజయ్‌ దేవరకొండ మూడో సినిమా కూడా లైన్లో పెట్టేశాడే!

April 18, 2026


img

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందనల పెళ్ళి ముచ్చట్లు ఇంకా పూర్తవనే లేదు. కానీ అప్పుడే ఇద్దరూ సినిమాలతో బిజీ అయిపోయారు. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం భార్య రష్మికతో కలిసి రాహుల్ సాంక్రుత్యన్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ ‘రణబాలి’ చేస్తున్నారు. మరోపక్క రవి కిరణ్ కోలా దర్శకత్వంలో కీర్తి సురేష్‌తో కలిసి గ్రామీణ నేపధ్యంతో సాగే ‘రౌడీ జనార్ధన’ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. 

ఈ రెండూ పూర్తికాక ముందే మూడో సినిమాకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశాడు. ‘హాయ్ నాన్న’తో ప్రేక్షకులను మెప్పించిన శౌర్యువ్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా ప్రకటన-పోస్టర్ నేడు సోషల్ మీడియాలో పెట్టారు. పోస్టర్ కాస్త విచిత్రంగా ఉంది. విజయ్‌ దేవరకొండ నాలుగు కుక్కలను పట్టుకొని ముందు నడుస్తుండగా వెనకే ఈ సినిమాకి పని చేయబోతున్న టీమ్‌ ఆయుధాలు పట్టుకు వస్తున్నట్లు చూపారు. ‘ఈ కోపమంతా ఒకప్పుడు ప్రేమే’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.  

ఈ సినిమాకు సంగీతం: హేషం అబ్దుల్లా వాహేబ్, కెమెరా: అలీజండ్రో మార్టినిజ్, ఎడిటింగ్: ప్రవీణ్ అంటోనీ చేయబోతున్నారు.          



Related Post

సినిమా స‌మీక్ష