భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ హీరోగా చేసిన ‘స్వయంభూ’ నుంచి ‘రారా ధీవర...’ అంటూ సాగే పవర్ ఫుల్ సాంగ్ ప్రమో కొద్ది సేపటిక్రితం విడుదలైంది. పూర్తిపాట ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు విడుదల కాబోతోంది.
ఈ సోషియో ఫాంటసీలో నిఖిల్‌కి హీరోయిన్లుగా నభా నటేష్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సునీల్, సుబ్బరాజు, సత్య తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: కెకె సెంథిల్ కుమార్, డైలాగ్స్: విజయ్ కామిశెట్టి, స్టంట్స్: కింగ్ సోలమన్, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు.
పిక్సల్ స్టూడియోస్ బ్యానర్‌పై టాగూర్ మధు, భువన్, శ్రీకర్ కలిసి పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న స్వయంభూ ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారాణాల వలన ఈ వేసవిలో విడుదలవుతోంది.
6:03 Pm today .. Get Ready to be Blown Away 💥🌋 by RARA DHEEVARA 1st SongFrom Swayambhu . Here is a Small Sneak Peak into the Epic Warrior World. pic.twitter.com/QJmq0Hycj9
— Nikhil Siddhartha (@actor_Nikhil) April 16, 2026