ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత రవిబాబు స్వీయ దర్శకత్వంలో నటించిన ‘రేజర్’ ట్రైలర్ ఈ నెల 18న సాయంత్రం 4.30 గంటలకు విడుదల కాబోతోంది. ఈ విషయం తెలియజేస్తూ చిన్న వీడియో క్లిప్ వదిలారు.
ఈ క్రైమ్, థ్రిల్లర్ సినిమాలో రవిబాబు ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మే 8వ తేదీన రేజర్ విడుదల కాబోతోంది.
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రవిబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ రాజేష్, కెమెరా: చరణ్ మాధవనేని చేశారు.