ప్రముఖ తెలంగాణ జానపద గాయని మంగ్లీ-లాయర్ సుబ్బారావు మధ్య జరుగుతున్న వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. నిన్న ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సుబ్బారావుపై పిర్యాదు చేసి, తాను ఎటువంటి తప్పు చేయలేదని, అవసరమైతే మైక్రో ఫైనాన్స్ కంపెనీ బాధితుల తరపున పోరాడుతానన్నారు. సుబ్బారావు తనని డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మంగ్లీ ఆరోపించారు.
ఆమె ఆరోపణలపై లాయర్ సుబ్బారావు కూడా ధీటుగా స్పందిస్తూ, “ఆమె ఎటువంటి తప్పూ చేయలేదంటే ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు డీజీపీ ఆఫీసుకు రండి. లేదా మధ్యాహ్నం 2 గంటలకు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌కి రండి. మీతో పాటు పేద ప్రజలను మోసం చేసిన రమావత్ మధు, భరత్ చౌహాన్, శైలజా చౌహాన్లను తీసుకురండి. అక్కడ నేను వంద మంది బాధితులతో కలిసి ఎదురు చూస్తాను. వారితో ఆమెకు ఎటువంటి సంబంధమూ లేకపోతే అక్కడే మీడియా సమక్షంలో బాధితుల తరపున వారు ముగ్గురినీ నిలదీయాలి. నన్ను బెదిరించిన శివ ఖచ్చితంగా ఆమె తమ్ముడే. అతను రమావత్ మధు కంపెనీలో భాగస్వామిగా ఉన్నాడు. కనుక అతనికి ఖచ్చితంగా ఈ కేసుతో సంబంధం ఉంది. ఒకవేళ లేదని పోలీసులు నిరూపిస్తే నేను బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి సిద్ధం. ఓ న్యాయవాదిగా నేను బాధితుల తరపున న్యాయ పోరాటం చేస్తుంటే, మంగ్లీ నాపై పిర్యాదు చేయడం దేనికి? ఆమె ఏ తప్పు చేయకపోతే నాతో కలిసి బాధితులకు న్యాయం చేసేందుకు న్యాయపోరాటం చేయోచ్చు కదా?” అని లాయర్ సుబ్బారావు మంగ్లీకి సవాలు విసిరారు.
దీనిపై మంగ్లీ ఏవిధంగా స్పందిస్తారో?
సింగర్ మంగ్లీకి అడ్వకేట్ సుబ్బారావు ఓపెన్ ఛాలెంజ్
బాధితుల తరఫున పోరాటం చేయాలనుకుంటే రేపు ఒంటి గంటకు డీజీపీ ఆఫీస్ కి రావాలి
లేదంటే మధ్యాహ్నం 2 గంటలకు బాధితుల తరఫున బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగే సమావేశానికి మంగ్లీ తన సోదరులతో కలిసి రావాలి
మంగ్లీ కి తెలిసే ఈ వ్యవహారం అంతా… https://t.co/ma1jd7hUdU pic.twitter.com/oIEkjpPHmk
(Video Source: Big TV Breaking News)