డీలిమిటేషన్‌కి మేము వ్యతిరేకం: స్టాలిన్

April 14, 2026


img

ఈ నెల 23న తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక అధికార డీఎంకే-కాంగ్రెస్‌ కూటమి, ప్రధాన ప్రతిపక్ష అన్నాడీఎంకే-బిజేపి కూటమి, టివికే పార్టీతో విజయ్‌ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్‌ కూడా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నారు. 

తమిళనాడు సిఎం రేవంత్ రెడ్డి స్టాలిన్ దీని గురించి మాట్లాడుతూ, “ఈ ప్రతిపాదనను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం దీని కోసం హడావుడిగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం సరికాదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే కలిసివచ్చే అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఇది బెదిరింపు కాదు. కేంద్రానికి చివరి హెచ్చరిక,” అని స్టాలిన్ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా ఓ వీడియో సందేశం పెట్టారు. 

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కూడా డీలిమిటేషన్‌ ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్‌ పార్టీ ఇంకా దీనిపై తమ వైఖరి తెలియజేయాల్సి ఉంది. 



Related Post