మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, అలనాటి అందాల నటి రవీనా టాండన్ కుమార్తె రాషా దడాని హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి వైబ్-యూ అంటూ సాగే లిరికల్ ఆడియో సాంగ్ విడుదలైంది.
అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటులు మోహన్ బాబు, నరేష్ నటిస్తున్నారు. నరేష్ పోస్టర్ ఇదివరకే విడుదల చేయగా ఇటీవలే మోహన్ బాబు పోస్టర్ కూడా విడుదల చేశారు.
ఈ సినిమాకు సంగీతం: జీవి.ప్రకాష్ కుమార్, కెమెరా: ఆర్‌డీ రాజశేఖర్, ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు.
ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై జెమిని కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.