వరంగల్‌ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ త్వరలో ప్రారంభోత్సవం

May 30, 2026
img

గత ప్రభుత్వం వరంగల్‌ సెంట్రల్ జైలుని వేరే చోటికి తరలించి అక్కడ రూ. 1,150 కోట్లు వ్యయంతో 56ఎకరాల విస్తీర్ణంలో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి 2021లో శంకుస్థాపన చేసి నిర్మాణం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని అవసరమైన మార్పులు చేర్పులు చేసి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తూ జోరుగా నిర్మాణ పనులు సాగించింది. దీంతో వరంగల్‌ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 

ప్రస్తుతం ఆపరేషన్ థియేటర్ల, ఆక్సిజన్ పైప్ లైనింగ్, సెంట్రల్ ఏసీ, రేడియేషన్ విభాగాల పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే ఆస్పత్రికి ప్రారంభోత్సవం జరుగనుంది. ముందుగా 34 విభాగాలలో ఓపీ, ఐపీ సేవలు ప్రారంభించనున్నారు.   

తెలంగాణ రాష్ట్రంలోనే 2,208 పడకలు కలిగిన ఏకైక ఆస్పత్రిగా ఇది నిలువబోతోంది. కనుక దీనిలో 500 మంది వైద్యులు, 1,000 మంది నర్సులు, మరో 1,000 సిబ్బంది పనిచేస్తారు. దీనికి అనుబంధంగా వైద్య, నర్శింగ్ కళాశాలలు, మెడికోలు, నర్సింగ్ విద్యార్ధులకు హాస్టల్స్ కూడా దీనిలోనే ఏర్పాటు చేస్తున్నారు.

ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలలో నిరుపేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కార్పోరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. 

Related Post