హైదరాబాద్‌లో తొలి కరోనా కేసు నమోదు

May 25, 2025
img

కరోనా మహమ్మారి మళ్ళీ ప్రపంచ దేశాలను పలకరిస్తోంది. ఇప్పటికే చైనా, థాయ్ లాండ్, హాంగ్ కాంగ్, సింగపూర్ తదితర దేశాలలో కరోనా కేసులు చాలా నమోదయ్యాయి. అప్పుడే కరోనా మరణాలు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు తెలంగాణతో సహ భారత్‌లో అన్ని రాష్ట్రాలలో మళ్ళీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. 

హైదరాబాద్‌లో ఓ వైద్యుడికి కరోనా సోకడంతో అదే తొలి కేసుగా నమోదైంది. కరోనా మళ్ళీ మొదలవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. 

హైదరాబాద్‌, గాంధీ ఆస్పత్రిలో 60 పడకలతో కరోనా రోగులకు చికిత్స చేసేందుకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. 

గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్‌ డాక్టర్ రాజకుమారి అధ్యక్షతన కరోనా కేసులను పర్యవేక్షించేందుకు 10 మంది వైద్య నిపుణులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్యశాఖతో టచ్‌లో ఉంటూ, కరోనా ఉదృతి, కేసుల సంఖ్య, మందులు, ఆక్సిజన్ సరఫరా వంటి అన్ని అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది.

Related Post