శంషాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

May 01, 2026
img

శంషాబాద్ వద్ద అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్: 16 వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు బలంగా డీ కొట్టడంతో కారులో ప్రయానిస్తున్నే ఏడుగురులో ఆరుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారే.

సిరిసిల్లా జిల్లాకు చెందిన వారు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అందరూ కలిసి కారులో యాదగిరి గుట్టకు వెళ్ళి హైదరాబాద్‌ తిరిగివస్తుండగా శంషాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద సమయంలో కారు చాలా వేగంగా ప్రయాణిస్తున్నందున అదుపు తప్పి లారీని చాలా బలంగా డీకొంది. దాంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయిపొయింది. కారు ముందు భాగం లారీ కింద చిక్కుకుపోవడంతో చనిపోయినవారిని బయటకు తీయడం చాలా కష్టమైంది. 

Related Post