శనివారం దేశవ్యాప్తంగా ప్రజలందరి ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లు రాబోతున్నాయి. మెసేజ్ వచ్చినప్పుడు ఫోన్ మోడల్, సెట్టింగ్ బట్టి పెద్దగా శబ్దం లేదా వైబ్రేషన్ వస్తుంది. దేశంలో ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు దేశ ప్రజలందరినీ ఒకేసారి అప్రమత్తం చేసేందుకుగాను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ శనివారం ప్రయోగాత్మకంగా మెసేజ్‌లు పంపించబోతోంది.
అయితే వాటిని చూసి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇది కేవలం వ్యవస్థ పనితీరుని పరీక్షించుకోవడానికి చేస్తున్న పరీక్ష మాత్రమే అని ఆ సంస్థ అధికారులు తెలిపారు.
ఎన్నికలు జరిగిన అస్సోం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో పుదుచ్చేరిలో, అలాగే దేశ సరిహద్దు ప్రాంతాలని రేపటి ఈ పరీక్ష నుంచి మినహాయించినట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
కనుక రేపు యావత్ దేశ ప్రజల మొబైల్ ఫోన్లు ఒకేసారి మోత మోగబోతున్నాయి.