ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా చేస్తున్న ‘ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్’ టీజర్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది. టీజర్ యువతని ఆకట్టుకునేలా సాగింది కనుక సినిమా కూడా అదేవిధంగా సాగితే హిట్ కొట్టడం ఖాయం.
ఈ సినిమా రేపు ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ వేసవిలో విడుదలవుతుందని టీజర్‌లో చెప్పారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ఆదిత్య హాసన్, సంగీతం: హేషం అబ్దుల్ వాహేబ్, కెమెరా: అజీం మొహమ్మద్, కోరియోగ్రఫీ: లీలావతి, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు.