డెకాయిట్ వెలిగించిన చిచ్చుబుడ్డి సాంగ్‌.. తుస్స్?

March 29, 2026
img

అడవి శేష్, మృణాళినీ ఠాకూర్ జంటగా చేస్తున్న‘డెకాయిట్-ఒక ప్రేమ కధ’ నుంచి చిచ్చుబుడ్డి సాంగ్‌ విడుదల చేశారు. పాట అద్భుతంగా ప్రారంభమైంది కానీ ఆ తర్వాత రొటీన్ పాట, డాన్స్‌గా తేలిపోయింది.

మంచి యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న అడవి శేష్ ఇలాంటి డాన్సులకు పనికిరాడనిపిస్తుంది. ఒక్కోసారి ‘ఊ అంటావా మావా ఉహూ అంటావా మావా..’ వంటి పాటలే ఆయా సినిమాలకు విపరీతమైన హైప్ సృష్టిస్తాయి. కానీ డెకాయిట్ వెలిగించిన ఈ చిచ్చుబుడ్డి తుస్సుమంది. కానీ తెలుగు సినీ పరిశ్రమకు జోనిట వంటి మరో చక్కటి హీరోయిన్‌, డాన్సర్ దొరికిందని చెప్పవచ్చు. 

భాస్కరభట్ల రవికుమార్ వ్రాసిన ఈ పాటని భీమ్స్ సిసిరోలియో స్వరపరిచి సంగీతం అందించగా రామ్‌ మిరియాల, జోనిట గాంధీ కలిసి పాడారు.  

షానీల్ డియో దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జాన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్‌ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.  

ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే: అడవి శేష్, షనీల్ డియో, డైలాగ్స్: అబ్బూరి రవి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ధనుష్ భాస్కర్, ఎడిటింగ్: కోదాటి పవన్ కళ్యాణ్‌, యాక్షన్: ఏ విజయ్ చేస్తున్నారు. 

డెకాయిట్ యాక్షన్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ కలిసి నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 10న విడుదల కాబోతోంది.

 


Related Post