అప్పుడే కవితక్క వరాలు: కేజీ టూ పీజీ ఉచిత విద్య

April 25, 2026


img

అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార సమయంలో మ్యానిఫెస్టోలు విడుదల చేసి హామీలు గుప్పిస్తుంటారు. కానీ కల్వకుంట్ల కవిత నేడు టీఆర్ఎస్‌ పార్టీ ప్రకటిస్తూనే రాష్ట్రంలో ప్రతీ పేద బిడ్డకి కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తానని తొలి  హామీ ప్రకటించారు.

‘మా పార్టీ అధికారంలోకి వస్తుంది.. నేను ముఖ్యమంత్రినవుతానని' ఆమె ఇప్పుడే చెప్పుకోవడం కాస్త అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ ఇది ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా చూడవచ్చు.

ఓ మహిళ నేతృత్వంలో నడిచే పార్టీ అంటే జనాలకు ముఖ్యంగా.. ఇతర పార్టీల నేతలకు, కార్యకర్తలకు నమ్మకం కలగడం కష్టం.

ఆమె కేసీఆర్‌ కుమార్తె కనుక భవిష్యత్‌లో రెండు పార్టీలు విలీనమైపోవచ్చనే అనుమానాలు ఉండనే ఉన్నాయి. కనుక ఆమె తన నాయకత్వ లక్షణాలు చాటుకునేందుకు ఈవిధంగా ఆత్మవిశ్వాసం ప్రదర్శించడం చాలా అవసరం.

అప్పుడే ప్రజలు, ఆమె పార్టీలో చేరాలా వద్దా అని ఊగిసలాడేవారికి ఆమె నాయకత్వంపై నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడే పార్టీ వేగంగా బలపడుతుంది కూడా. 

కనుక ఇస్రో రాకెట్ నిప్పులు చిమ్ముతూ గాల్లోకి లేచిన వెంటనే కొన్ని సెకన్ల వ్యవధిలోనే వేగంగా అంతరిక్షంలోకి దూసుకుపోయి కక్ష్యలోకి చేరినట్లుగా ,కల్వకుంట్ల కవిత కూడా తొలి రోజు నుంచే రాకెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. ఆమె లక్ష్యం సాధించాలంటే ఈ స్పీడ్ చాలా అవసరమే.   


Related Post