కవితపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు.. అందుకేనా?

April 29, 2026


img

ఇటీవల కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్‌ పార్టీ ప్రకటిస్తూ తండ్రి కేసీఆర్‌ని స్పందన లేని మర మనిషి... కాళేశ్వరం ప్రాజెక్టులో  అవినీతి జరుగుతోందని హెచ్చరించినందుకు నన్నే బయటకు గెంటేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయించారు. బడుగు బలహీనవర్గాలకు అన్యాయం చేశారు,” అంటూ తీవ్ర విమర్శలు, అనేక ఆరోపణలు చేశారు. 

వాటిపై బీఆర్ఎస్‌ పార్టీలో ఇంత వరకు ఎవరూ మాట్లాడలేదు. ఇటీవల తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్‌ పార్టీ రజతోత్సవ వేడుకల ముగింపు సమావేశంలో పాల్గొన్న కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు ఎవరూ కూడా స్పందించలేదు. కానీ మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. 

“పార్టీ పెట్టడం అంటే పాన్ టేలా పెట్టడం కాదు. ఆమె పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవు. పార్టీ పెడుతూనే ఉద్యమకారుడైన తన తండ్రి గురించి చాలా తప్పుగా మాట్లాడింది. సొంత తండ్రి గురించి అలా మాట్లాడుతున్న వ్యక్తి ఇక పార్టీలో నేతలని, ఇతరులని గౌరవిస్తుందని ఎలా అనుకోగలం?” అని అన్నారు. 

ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ మంత్రి పదవి గురించి మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా తనకు అవకాశం లభిస్తుందని భావిస్తునానని అన్నారు. లేకుంటే పార్టీ వీడాలని చాలా కాలం క్రితమే నిశ్చయించుకున్నారు కనుక బీఆర్ఎస్‌ పార్టీలో చేరేందుకు ఈవిధంగా మాట్లాడి ఉండవచ్చు.   


Related Post