వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ ‘రావు బహదూర్’గా నటిస్తున్న సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేశారు. జూన్ 5న రావు బహద్దూర్ విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.
ఈ సినిమాలో సత్యదేవ్ రాజ వంశానికి చెందిన వృద్ధుడైన ‘రావు బహదూర్’గా నటిస్తున్నారు. రావు బహదూర్ వేషంలో సత్యదేవ్‌ని గుర్తుపట్టడం కూడా కష్టమే. మేకప్ అంత అద్భుతంగా ఉంది. ప్రతీరోజు మేకప్ వేసుకోవడానికి, షూటింగ్ తర్వాత తొలగించుకోవడానికి కనీసం 5-6 గంటలు పడుతోందని చిత్ర బృందం తెలిపింది. ‘రావు బహద్దూర్’ వంశాకురం గురించి ఈ కథ అని టీజర్ చూసినప్పుడు అర్ధమవుతుంది.
ఈ సినిమాలో వికాస్ ముప్పల, దీప థామస్, బాలీవుడ్ పరసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినినిమాకు కథ, దర్శకత్వం, ఎడిటింగ్: వెంకటేష్ మహా, సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: కార్తీక పర్మర్, కోరియోగ్రఫీ: శ్రావణ్ ముప్పిరి చేస్తున్నారు.
ఈ సినిమా నిర్మాణంలో మహేష్ బాబు కూడా భాగస్వామిగా ఉన్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మహాయాన బ్యానర్లపై చింత గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి నిర్మిస్తున్న ‘రావు బహదూర్’ జూన్ 5న విడుదల కాబోతోంది.
JUNE 5th, 2026 ❤️🔥❤️🔥❤️🔥#RaoBahadur 🔥 pic.twitter.com/EQFbI7rxLH
— Rao Bahadur (@RaoBahadurMovie) April 26, 2026