కవిత కొత్త పార్టీ ఇంత ఆసక్తి దేనికంటే..

April 24, 2026


img

తెలంగాణ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు పుడుతుంటాయి కొంతకాలం తర్వాత మాయం అవుతుంటాయి. కానీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రేపు ప్రారంభించబోయే పార్టీ ప్రత్యేకమైనది. వేరెవరో పార్టీ స్థాపిస్తే ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కారు. 

కానీ ఆమె మాజీ సిఎం, బీఆర్ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ కుమార్తె కావడంతో ఆమె పార్టీ ఏర్పాటు పట్ల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆమె తండ్రి, అన్న నడిపిస్తున్న బీఆర్ఎస్‌ పార్టీకి పోటీగా ఈ పార్టీ స్థాపిస్తుండటం, వచ్చే ఎన్నికలలో పోటీ చేసి నేనే ముఖ్యమంత్రి అవుతానని చాలా ధైర్యంగా, నమ్మకంగా చెపుతుండటంతో ప్రజలలో మరింత ఆసక్తి పెరిగింది. 

ఈ రెండు పార్టీల మద్య ఏం జరగబోతోంది? రెండూ నిజంగానే రాజకీయ శత్రువులుగా కొనసాగుతాయా లేక భవిష్యత్‌లో విలీనం అయిపోతాయా? భవిష్యత్‌లో రెంటిలో ఏది బిజేపితో చేతులు కలుపుతుంది? 

కవిత పార్టీ ఏర్పాటు కాగానే బీఆర్ఎస్‌ పార్టీ నుంచి నేతలు దానిలోకి క్యూ కడతారా? లేక కేసీఆర్‌నే అంటిపెట్టుకొని ఉంటారా?ఈ రెండు పార్టీల పోరాటాల వలన కాంగ్రెస్‌, బిజేపిలకు లాభమా నష్టమా? 

భవిష్యత్‌ అసలు మరో రెండున్నరేళ్ళ తర్వాత వచ్చే ఎన్నికల వరకు కల్వకుంట్ల కవిత ఒక్కరే పార్టీ నిర్వహణ ఖర్చుల భారం భరించగలరా లేదా? వంటి అనేక ప్రశ్నలు ఆసక్తి రేకిత్తిస్తాయి. కనుక తెలంగాణతో పాటు ఆంధ్రాలో ప్రజలు, పార్టీలు, వాటి నాయకులు ఆసక్తిగా కల్వకుంట్ల కవిత చేయబోయే రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. 



Related Post