ఖల్ నాయక్ రిటర్న్స్… టీజర్‌

April 25, 2026


img

దాదాపు 33 ఏళ్ళ క్రితం అంటే 1993లో సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రలలో ‘ఖల్ నాయక్’ (విలన్) హిందీ సినిమా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత  దానికి సీక్వెల్‌గా ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ వస్తోంది. దీని టీజర్‌ శుక్రవారం విడుదలైంది. ‘ఖల్ నాయక్’లో సంజయ్ దత్ చేసిన విలన్‌ పాత్ర, ఆ సినిమాలో సంజయ్ దత్ నాయక్ నహీ ఖల్ నాయక్ హూ మై' అనే పాటకు చేసిన డాన్స్,  ‘చోళీ కే పీచే క్యా హై’ పాట, దానికి మాధూరీ దీక్షిత్ చేసిన డాన్స్ హైలైట్‌ అని చెప్పవచ్చు. 

ఇన్నేళ్ళ తర్వాత వస్తున్న ‘ఖల్ నాయక్ రిటర్న్స్’లో కూడా సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నట్లు టీజర్‌తో స్పష్టమైంది. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ రోజుల్లోనే ‘ఖల్ నాయక్’ మెప్పించినప్పుడు, అద్భుతమైన గ్రాఫిక్స్, ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో ‘ఖల్ నాయక్’ చేసే భీభత్సం మామూలుగా ఉండదు. కనుక ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష