రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంటగా చేస్తున్న ‘పెద్ది’ షూటింగ్ మరో ఆరు రోజులలో పూర్తవుతుందని దర్శకుడు బుచ్చిబాబు నిన్న తెలియజేశారు. ఈ విషయం తెలియజేస్తూ రామ్ చరణ్‌తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పెట్టారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ గ్రామీణ క్రికెటర్ పెద్దిగా నటిస్తూనే పెద్ది పహిల్వాన్‌గా కనిపిస్తారు. కనుక ఇద్దరి మద్య అడ్డుగా క్రికెట్ బ్యాట్ పెట్టి మరో పోస్టర్ విడుదల చేశారు. అది కూడా వైరల్ అవుతోంది.
ఈ నెల 30న విడుదల కావాల్సిన పెద్ది జూన్‌కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అదే విషయం మరోసారి ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు.
పెద్దిలో టాకీ పార్ట్ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో వెలువడుతున్న ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు ఉండటంతో ఐటెం సాంగ్ విషయంలో కూడా ఏ మాత్రం రాజీ పడకుండా తీయాలనుకోవడంతో అదొక్కటే మిగిలిపోయింది.
దీని కోసం చాలా మంది హీరోయిన్ల పేర్లు పరిశీలించిన తర్వాత అఖండ-2లో ‘జాజికాయ జాజికాయ’ అంటూ మెప్పించిన సంయుక్తని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్, కోచ్ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.
Final 6 days on #Peddi sets 🔥
My most inspiring character…
My beloved Peddi ❤️🤗@AlwaysRamCharan Sir ❤️❤️❤️ pic.twitter.com/d9SF2FR2kX