కాళేశ్వరం కేసులో ఎవరిపై చర్యలొద్దు: హైకోర్టు

April 22, 2026


img

కాళేశ్వరం కమీషన్ ఏర్పాటు, దాని నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేసీఆర్‌, హరీష్‌ రావు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు నేడు తుది తీర్పు చెప్పింది. పీసీ ఘోష్ కమీషన్ విచారణ నిబంధనలకు అతీతంగా సాగిందని హైకోర్టు అభిప్రాయపడింది. కనుక కమీషన్ నివేదిక ఆధారంగా ఎవరిపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు తీర్పు చెప్పింది. 

హైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే వెంటనే సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకుగాను హరీష్‌ రావు తదితరులు మొన్న ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టు న్యాయవాదులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ అనూహ్యంగా తీర్పు వారికి అనుకూలంగా రావడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

హైకోర్టు తాజా తీర్పుతో కేసీఆర్‌, హరీష్‌ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సభర్వాల్, ఎస్‌కే జోషిలకు ఉపశమనం లభించింది. కనుక దీనిపై బీఆర్ఎస్‌ పార్టీ స్పందన ఏవిధంగా ఉంటుందో ఊహించవచ్చు. కానీ దీనిపై కాంగ్రెస్‌ పార్టీ ఏమంటుందో? 


Related Post