చర్చలకు రండి: టిజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం

April 21, 2026


img

బుధవారం నుంచి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు సిద్ధం అవుతున్నారు. సమ్మె నోటీస్ ఇచ్చి 41 రోజులవుతున్నా ఇంత వరకు ప్రభుత్వం కానీ ఆర్టీసీ యాజమాన్యం గానీ పట్టించుకోనందునే సమ్మెకు సిద్దమవుతున్నామని ఆర్టీసీ జేఏసి చైర్మన్‌ వెంకన్న ఈరోజు మధ్యాహ్నం చెప్పారు.

ఆ తర్వాత కొద్ది సేపటికి టిజీఎస్ ఆర్టీసీ  ఆర్టీసీ ఈడీ వెంకన్న, ఆర్టీసీ సిపిఎం ఉషాదేవి జేఏసీ వారికి ఫోన్ చేసి చర్చలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఈరోజు సాయంత్రం బస్ భవన్‌ లేదా సచివాలయం లేదా మినిస్టర్స్ క్వార్టర్స్ లో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఉద్యోగుల ప్రధాన డిమాండ్. అవి కాక జీతాల పెంపు, డీఏ బకాయిలు, ఉద్యోగాల భర్తీ, పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయడం వంటి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. వాటిని అమలుచేయాలంటే ప్రభుత్వం పూనుకోవాల్సి ఉంటుంది.   



Related Post