జీవన్ రెడ్డి అప్పుడే మొదలుపెట్టేశారే!

April 21, 2026


img

సాధారణంగా పార్టీ మారినవారు తమ నిజాయితీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. అందుకు ఏకైక మార్గం తాము విడిచిపెట్టి వచ్చిన పార్టీ, అంతకాలం కలిసి పనిచేసిన నేతలపై తీవ్ర విమర్శలు చేయడమే. జీవన్ రెడ్డి కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. 

కేసీఆర్‌ ఆయనకు బీఆర్ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి వంటి కీలకమైన పదవి కట్టబెట్టారు కనుక అయన ఈ నిజాయితీ నిరూపణ బాధ్యత ఇంకా ఎక్కువుంటుంది. కనుక అప్పుడే మొదలుపెట్టేశారు. 

ఆయనేమన్నారంటే, “రేవంత్ రెడ్డి ఎప్పటికీ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని అనుకుంటున్నారు. కానీ మరోపక్క బిజేపి పెద్దలతో టచ్‌లో ఉన్నారు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం గుడ్డిగా ఆయననే నమ్ముకుంది. కనుక  రేవంత్ రెడ్డి చేయకూడని పనులన్నీ చేస్తున్నా చూసీ చూడనట్లు ఊరుకుంటోంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పూర్తి బలమున్నా తప్పుడు పనులు చేయడం దేనికి? సిఎం రేవంత్ రెడ్డికి బిజేపి అదిష్టానానికి మద్యవర్తిత్వం చేయడానికి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆ ధైర్యంతోనే రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు,” అని జీవన్ రెడ్డి విమర్శించారు.


Related Post