ఏప్రిల్‌ 27న తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సమావేశం

April 22, 2026


img

ఈ నెల 27న తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్‌ పార్టీ శ్రేణులు ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోబోతున్నాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో గులాబీ జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై వర్తమాన రాజకీయాలు, బీఆర్ఎస్‌ పార్టీ పరిస్థితి, భవిష్యత్‌ కార్యాచరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం వంటి అన్ని ముఖ్యాంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. 

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, ఎంపీలు, మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు కూడా హాజరవుతారని బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మంగళవారం ఓ ప్రకటన  ద్వారా మీడియాకు తెలియజేశారు. 

మొన్న జగిత్యాల సభలో కేసీఆర్‌ కూతురు కవిత రాజకీయాల గురించి, డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్ బిల్లుల గురించి, పార్టీ పేరు మార్పు గురించి చాలా విషయాలు మాట్లాడుతారని అందరూ ఎదురుచూశారు. కానీ రొటీన్ ప్రసంగం చేసి వెళ్లిపోవడంతో పార్టీ శ్రేణులు కూడా నిరుత్సాహ పడి ఉండొచ్చు.

కనుక కనీసం పార్టీ అంతర్గత సమావేశంలోనైన అన్ని విషయాలు మాట్లాడుతారని పార్టీ శ్రేణులు ఆశపడుతున్నాయి. మరి ఈసారి కేసీఆర్‌ ఏం చెప్తారో?


Related Post