కవిత పార్టీ పేరు: టిఆర్ఎస్‌!

April 25, 2026


img

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన. అంటే తెలుగులో క్లుప్తంగా తెరాస, ఇంగ్లీషులో టీఆర్ఎస్‌ అన్నమాట! 

మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని  అద్వయ ఫంక్షన్ హాలులో భారీగా తరలివచ్చిన కార్యకర్తలు సమక్షంలో ఆమె పార్టీ పార్టీ పేరు ప్రకటించి జెండా ఆవిష్కరించారు. పసుపు నేపధ్యంలో నీలం రంగుతో తెలంగాణ చిత్ర పటం, దానిపై ఇంగ్లీషులో టీఆర్ఎస్‌ కిందన తెలుపు రంగులో తెలంగాణ రాష్ట్ర సేన అని ముద్రించారు. 

ఇటీవలే బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మాట్లాడుతూ పార్టీ పేరుని మళ్ళీ టీఆర్ఎస్‌గా మార్చాలనే ప్రతిపాదనపై ఆలోచిస్తున్నామనన్నారు. కానీ బీఆర్ఎస్‌ పార్టీ ఇక ఎన్నటికీ పేరు మార్చుకునే అవకాశం లేకుండా చేశారు కల్వకుంట్ల కవిత.


Related Post