మొన్న ఝల్‌మోరీ..నేడు హుగ్బోలీ నదిలో ట్ షికార్

April 24, 2026


img

పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం ముగిసింది. మళ్ళీ ఈ నెల 29న తుది దశ పోలింగ్ జరుగుతుంది. ఈసారి ఎట్టి పరిస్థితులలో ఎన్నికలలో బిజేపిని గెలిపించుకొని బెంగాల్లో కాషాయ జెండా ఎగురేయాలని ప్రధాని మోడీ, అమిత్ షా, బిజేపి నేతలు చాలా పట్టుదలగా ఉన్నారు. కనుక ఎన్నికల ప్రచారం హోరెత్తించారు. ప్రధాని మోడీ స్వయంగా చేస్తున్న ఎన్నికల విన్యాసాలు మీడియాలో బాగా హైలైట్ అవుతున్నాయి. సామాన్య ప్రజలను కూడా చాలా ఆకట్టుకుంటున్నాయి. 

ఇటీవల ఝూర్‌గ్రామ్‌ జిల్లాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నప్పుడు దారిలో ఓ దుకాణం వద్ద మోడీ కాన్వాయ్ ఆగింది. ప్రధాని మోడీ కారులో నుంచి దిగి రోడ్డు పక్కనే ఉన్న ఝల్‌మోరీ (మమర్మారాలు, పల్లీ, ఉల్లిపాయలు వగైరాలతో చేసే మిక్చర్) దుకాణం వద్దకు వెళ్ళి దుకాణదారుడిని పలకరించి ఝల్‌మోరీ తయారు చేయించుకొని రుచి చూశారు. రుచి చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకుంటూ అతని చేతిలో బలవంతంగా డబ్బు పెట్టారు. ఎన్నికలకు ముందు ఈ వీడియో ఆ రాష్ట్రంలోనే కాక ఎన్నికలు జరుగుతున్న తమిళనాడుతో సహా దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా చూశారు. ఈ ప్రభావం బెంగాలలోని నిరుపేద సామాన్య ఓటర్లపై ఎంతో కొంత తప్పక ఉంటుంది కదా? 

శుక్రవారం ఉదయం హౌరా స్టేషన్ సమీపంలో హుగ్లీ నది తీరంలో కాసేపు మార్నింగ్ వాక్ చేస్తూ స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఎన్నికలలో బిజేపిని గెలిపిస్తే పశ్చిమ బెంగాల్‌ని కేంద్ర ప్రభుత్వం మరింత వేగంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తుందని చెప్పారు. ఆ తర్వాత ప్రధాని మోడీ హుగ్లీ నదిలో కాసేపు బోట్ షికార్ చేసి ఫోటోలు తీశారు. పనిలో పనిగా బోట్ షికార్ చేస్తున్నప్పుడు దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “బెంగాలీల జీవితాలలో గంగానది (హుగ్లీ)కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆ జలాలు ఓ ప్రాచీన నాగరికత స్పూర్తిని మోసుకువెళ్తాయి,” అని ట్వీట్‌ చేశారు. 

బెంగాల్‌తో సహా నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు మే 4న ప్రకటిస్తారు.       


Related Post