నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
కనుక దయచేసి కార్మికులు ఎవరూ ఈవిధంగా క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని కుటుంబాలను రోడ్డున పడేయొద్దు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది,” అని అన్నారు.
నిన్న మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్, సమ్మెపై చర్చ జరుగుతున్న సమయంలోనే మూడు జిల్లాలలో ముగ్గురు ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యాయత్నం చేశారు.
గతంలో కేసీఆర్ హయంలో సమ్మె సుదీర్గంగా సాగడంతో పలువురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనుక ఇప్పుడూ అలాంటి ప్రమాదమే పొంచి ఉంది.
కనుక ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను నేడు చర్చలకు ఆహ్వానించింది. ముందుగా వారితో ఐఏఎస్ అధికారులు తర్వాత మంత్రుల సబ్ కమిటీ సమావేశమవుతుంది.
నేటితో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకి చేరింది. సమ్మెతో బస్సులన్నీ నిలిచిపోయినందున ఆర్టీసీకి ప్రతీరోజు కోట్లాది రూపాయలు నష్టం కలుగుతోంది. బస్సులు లేకపోవడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.