గుజరాత్‌లోని సూరత్ నగరంలో రోడ్లపై నిన్న ఓ అద్భుతమైన దృశ్యం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. మొండెం లేకుండా కాళ్ళ వరకు ఉన్న ఓ విచిత్ర ఆకారం నగర వీధులలో సైకిల్ తొక్కుతూ కనిపించింది. మొదట దానిని చూసి జనం కంగారు పడినా, అదొక ఏఐ ఆధారంగా సైకిల్ నడుస్తున్న సైకిల్ అని గ్రహించి అందరూ ఆశ్చర్యపోయారు.
దాని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో తమ బంధుమిత్రులకు పంపించుకున్నారు. దీనికి వారు ‘ఘోస్ట్ సైకిల్’ అని పేరు పెట్టారు.
మీడియా ప్రతినిధులు దీని గురించి ఆరా తీయగా, సూరత్‌లోని శివం శౌర్యం అనే యువకుడు తన స్నేహితుడు గురువారం ప్రీత్ అరోరాతో కలిసి దీనిని తయారుచేసినట్లు కనుగొన్నారు.
ఇంజనీరింగ్, ఏఐ సాంకేతిక పరిజ్ఞానం జోడించి ఈ సైకిల్ రూపొందించినట్లు వారు తెలిపారు. దీనిని తయారుచేసేందుకు మూడు నెలల సమయం పట్టిందని, రూ.35,000 ఖర్చయిందని వారు తెలిపారు.
సైకిల్‌కి అమర్చిన సీసీ కెమెరాలు, సెన్సర్స్, దానిపై కూర్చొని తొక్కుతున్న బొమ్మలో రిమోట్ కంట్రోల్ వ్యవస్థలని ఏఐ నియంత్రిస్తుందని తెలిపారు. అవసరమైతే రిమోట్ ద్వారా కూడా సైకిల్‌ని నియంత్రించవచ్చని తెలిపారు.
ఈ సెన్సార్ వ్యవస్థల ద్వారా సైకిల్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ యాంత్రిక శక్తితో ముందుకు సాగుతుందని తెలిపారు. కెమెరాల ద్వారా చుట్టుపక్కల సంచరించే మనుషులు, పశువులు, వాహనాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, అవరోధాలు గమనించి దిశ మార్చుకుంటుందని అవసరమైన చోట నిలుస్తుందని వారు తెలిపారు.
వీరిరువురికీ సోషల్ మీడియాలో ‘క్రియేటివ్ సైన్స్’ అనే హ్యాండిల్ ఉంది. వీరికి 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

#गुजरात

युवा शिवम मौर्य ने बनाई “Ghost Cycle”

बिना ड्राइवर खुद चलती है और रास्ता तय करती है

AI, मैपिंग सिस्टम और मोबाइल ऐप से लैस

सिर्फ ₹35,000 में 3 महीने में तैयार

भारतीय इनोवेशन का शानदार उदाहरण#GhostCycle #Innovation #AI #Gujarat #TechInnovation #StartupIndia… pic.twitter.com/2R95IiZJwu
— Abcnews.media (@abcnewsmedia) April 23, 2026