త్వరలో కేసీఆర్‌ బస్సు యాత్ర?

April 26, 2026


img

జగిత్యాల సభతో మళ్ళీ ప్రజల మధ్యకు కేసీఆర్‌ రావడంతో బీఆర్ఎస్‌ పార్టీ శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ఇదే ఊపులో ఆయన జిల్లా పర్యటనలు చేయాలని నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. 

కేసీఆర్‌ కూడా అదే ఆలోచనలో ఉన్నందున త్వరలోనే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను కవర్ చేస్తూ బస్సు యాత్ర చేపట్టబోతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత హరీష్‌ రావు చెప్పారు. దీనికి ఏర్పాట్లు, రూట్ మ్యాప్ జరుగుతున్నాయని హరీష్‌ రావు చెప్పారు. అన్నీ సిద్దం కాగానే కేసీఆర్‌ బస్సు యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్ ప్రకటిస్తామని హరీష్‌ రావు అన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమీషన్ ఏర్పాటు చేయడం, దాని నివేదిక, కోర్టు కేసు గురించి హరీష్‌ రావు మాట్లాడుతూ, “తెలంగాణ సాధించి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసినవారు కేసీఆర్‌. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ అంతటా నీళ్ళు పారించారు. 

కానీ కేసీఆర్‌ని, నన్ను, మా ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే తప్పుడు ఆరోపణలతో కమీషన్ ఏర్పాటు చేసి తప్పుడు నివేదిక తయారు చేయించారు. కనుక వారి ప్రయత్నాలను అడ్డుకోవడానికి మేము న్యాయపోరాటం చేయక తప్పడం లేదు. ఒకవేళ హైకోర్టులో మాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు ఢిల్లీ వెళ్ళాము తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు,” అని అన్నారు.


Related Post