హైదరాబాద్‌లో అంతరిక్ష రాకెట్ విక్రమ్‌-1 శ్రీహరికోటకు పయనం

April 25, 2026
img

దేశంలో తొలిసారిగా ప్రైవేట్ రంగంలో అంతరిక్ష రాకెట్ విక్రమ్‌-1 తయారైంది. హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరో స్పేస్ పార్కులో ఏర్పాటైన స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీలో దీనిని పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారు చేశారు.

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఈరోజు స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీలోని మాక్స్ క్యూ క్యాంపస్‌లో దీనికి జెండా ఊపారు. అక్కడి నుంచి అది ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గం ద్వారా శ్రీహరికోటకు బయలుదేరింది. ఇస్రో సంస్థ దీనిని అంతరిక్షంలోకి ప్రయోగిస్తుంది. 

స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీలో ఇప్పైకే ఫ్రాన్స్ దేశానికి చెందిన సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసింగ్ సేవలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీ అధికారులను కంపెనీలో తయారవుతున్న వివిధ ఉత్పత్తులు, అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. 

Related Post