హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ బాయ్ ఫ్రెండ్ సౌరబ్ దింగ్ర హీరోగా చేసిన ‘ఫస్ట్ టైమ్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో జరిగింది.
ఇదొక సైంటిఫిక్ మూవీ. ఇలాంటి కథతో తెలుగులో సినిమాలు రాలేదు. కనుక ఇది తెలుగు ప్రేక్షకులకు కూడా ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు.
ఈ సినిమాలో సౌరబ్‌కి జోడీగా అనిక విక్రమన్ నటించగా, ఆషి సార్ధక్ మరో హీరోయిన్‌గా చేసింది. మీమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్తా, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
హేమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు కధ, దర్శకత్వం, ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్, నిర్మాత: హేమంత్ ఇప్పలపల్లి, సంగీతం: శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురూప్, కెమెరా: వేణు మురళీధర్, రామ్ చేశారు.
ఈ సినిమా మే 22న విడుదల కాబోతోంది.