వాల్తేర్ వీరయ్యకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీ కొల్లితో చిరంజీవి 158వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ నారాయణ, లోహిత్ కలిసి నిర్మించబోతున్న ఈ సినిమా కోసం దర్శకుడు బాబీ నేడు ‘లుక్ టెస్ట్’ చేసి ఓకె అయ్యిందని తెలిపారు.
‘లుక్ టెస్ట్’ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కానీ చిరంజీవి మొహం కనపడకుండా చిన్న సస్పెన్స్ ఉంచారు. త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. కనుక త్వరలోనే దీనిలో నటించబోయే హీరోయిన్, ఇతర నటీనటుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.
చిరంజీవి విశ్వంభర ముగించిన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మొదలుపెట్టిన ‘మన శంకరవర ప్రసాద్ గారు’ ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టింది. కానీ విశ్వంభర ఇంకా రానేలేదు. జూలై 10న విడుదల కాబోతోంది. ఆలోగా చిరంజీవి బాబీతో ఈ సినిమా మొదలుపెడుతున్నారు.
మేలో షూటింగ్ మొదలుపెట్టి’ నాలుగు నెలల్లో పూర్తిచేయగలిగితే దసరా, దీపావళికి రిలీజ్ చేయగలుగుతారు. అప్పుడు ఈ ఏడాదిలో మూడు సినిమాలు చేసిన హీరోగా చిరంజీవి రికార్డు సృష్టించగలరు. ఇదే లెక్కన నాలుగు నెలలకో సినిమా చేయగలిగితే ఇక తిరుగే ఉండదు.