రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో చంద్రబాబు, జగన్ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఏపీలో జోరుగా రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. అదే సమయంలో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో శరవేగంగా అన్ని రంగాలలో అభివృద్ధి పనులు జరుగుతుండేవి.
కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాలలో ఈ పరిస్థితి తారుమారు అయ్యింది. ఇప్పుడు ఏపీలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతుంటే ఇప్పుడు తెలంగాణలో జోరుగా రాజకీయాలు సాగుతున్నాయి. కాంగ్రెస్, బిజేపి, బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీల మద్య జరుగుతున్న రాజకీయాలు, రాజకీయ ఆధిపత్య పోరు అందరూ చూస్తూనే ఉన్నారు.
కానీ ఏపీ రాజధాని అమరావతి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతుంటే మరో పక్క శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడితో అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఏపీలో ఏర్పాటవుతున్నాయి. దీనికి రెండు తాజాగా ఉదాహరణలు చెప్పుకోవచ్చు.
ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీ గూగుల్ కంపెనీ రూ.1.35 లక్షల కోట్లు పెట్టుబడితో విశాఖ జిల్లాలో ఆసియాలో కెల్లా అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. జిల్లాలోని మూడు వివిధ ప్రాంతాలలో మూడు వేర్వేరు యూనిట్లుగా దీనిని మొత్తం 600 ఎకరాల విస్తీర్ణంలో 1 గిగావాట్ సామర్ధ్యంతో నిర్మిస్తున్నారు. నేడు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, గూగుల్ కంపెనీ ప్రతినిధులు కలిసి దీనికి విశాఖలో శంఖుస్థాపన చేశారు.
విశాఖ పక్కనే అనకాపల్లి జిల్లాలో రూ. 1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఆర్స్‌లర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రాబోతోంది. దీనికి ఎగుమతి, దిగుమతుల కోసం ఓ ప్రైవేట్ పోర్టు కూడా నిర్మిస్తున్నారు. ఇదే జిల్లాలో రాంబిల్లి వద్దనే రూ.5,400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ‘రెన్యుబుల్ ఎనర్జీ’ అనే కంపెనీ ‘క్లీన్ ఎనర్జీ’ అనే పరిశ్రమని ఏర్పాటు చేస్తోంది. దీనికి ఇటీవల సిఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.
ఇక విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం జిల్లాల మద్యన భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని మోడీ జూలై లేదా ఆగస్టులో ప్రారంభోత్సవం చేయనున్నారు.
ప్రభుత్వాలు మారగానే కేవలం రెండున్నరేళ్ళలోనే రెండు రాష్ట్రాలలో పరిస్థితులు ఈవిధంగా మారిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
జగన్ అరాచక పాలన, అనాలోచిత నిర్ణయాలు, కక్ష సాధింపు రాజకీయాలతో దివాళా తీసిన ఆంధ్రప్రదేశ్ ఇక ఎప్పటికైనా తెరుకోలేదని ఆ రాష్ట్ర ప్రజలే ఆశలు వదిలేసుకున్నారు. కానీ కేవలం రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్ ఇంత వేగంగా అభివృద్ధి చెందుతుంటే, రెండున్నరేళ్ళలో తెలంగాణలో ఏం జరుగుతోంది? అని ప్రశ్నించుకుంటే కేవలం రాజకీయాలు మాత్రమే అని చెప్పుకోవాలేమో?
గూగుల్ @ ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నంలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ప్రతిష్ఠాత్మక గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్‌కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, ప్రజాప్రతినిధులు, గూగుల్ ప్రతినిధులు.… pic.twitter.com/mF1hagIqBT