భారత్‌లో బాలికలకు క్యాన్సర్ టీకా...

February 18, 2025
img

భారత్‌లో నిత్యం వేలాదిమంది ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి బారిన చనిపోతూనే ఉన్నారు. వారిలో మహిళల సంఖ్య కూడా చాలా ఎక్కువే. ముఖ్యంగా ఖరీదైన క్యాన్సర్ చికిత్స చేయించుకోలేని నిరుపేద మహిళల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. తీవ్రమైన ఈ సమస్యపై ప్రధాని మోడీ తొలిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడే దృష్టి సారించారు.

క్యాన్సర్ రాకుండా నివారించేందుకు టీకా తయారుచేయాలనే ప్రధాని మోడీ సంకల్పం ఇన్నేళ్ళకు ఫలించబోతోంది. ముందుగా 9 నుంచి 16 ఏళ్ళ లోపు బాలికల కోసం క్యాన్సర్ టీకా సిద్దామయ్యిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ ఢిల్లీలో మీడియా ప్రతినిధులకు తెలియజేశారు.

ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ (టీకా) క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని అవి సత్ఫలితాలు ఇస్తే ఆరు నెలల్లోగా క్యాన్సర్ టీకా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మహిళలను ఎక్కువగా పీడిస్తున్న నోరు, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లని నివారించడానికి, నియంత్రించడానికి ఉపయోగపడుతుందని మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు.      

పేద ప్రజలు, ముఖ్యంగా మహిళల క్యాన్సర్ పరీక్షలు, చికిత్సల కోసం దేశవ్యాప్తంగా డే-కేర్ క్యాన్సర్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటిలో 30 ఏళ్ళు పైబడిన మహిళలకు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేస్తామని చెప్పారు. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మందులపై కస్టమ్స్ సుంకాలు రద్దు చేశామని కనుక ఆయా మందుల ధరలు తగ్గుతాయని చెప్పారు.

Related Post