హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ ఎప్పటికప్పుడు కొత్తరకం మోసాల గురించి తెలియజేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంటారు. తాజాగా ఆయన ఓ తప్పుడు వార్తని ప్రచారం చేస్తున్న ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దానిలో ఓ మహిళా ఈ నెల 14న లోక్ అదాలత్ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అన్ని రకాల వాహనాల చలాన్లపై 80శాతం రాయితీ ఇస్తున్నట్లు చెప్పింది. కనుక ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించింది.
ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ రావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమె చెప్పినట్లు అటువంటి రాయితీ ఏమీ ఇవ్వడం లేదని కానీ వ్యూస్, లైక్స్ కోసం ఇలాంటి తప్పుడు సమాచారంతో కొందరు రీల్స్ చేస్తున్నారన్నారు.
దయచేసి ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మకండి.. ఇతరులకు షేర్ చేయకండి. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించి, ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు! అని హెచ్చరించారు.
సమాజానికి ఉపయోగపడే అనేక అంశాలు ఉండగా వాటి గురించి వివరించి వ్యూస్, లైక్స్ సంపాదించుకోవచ్చు. లేదా జోకులు, డాన్సులు, వంటలు, వంటింటి కిటుకులు, ఆరోగ్యానికి సంబందించిన విషయాలు, చుట్టుపక్కల చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు గురించి చెప్పవచ్చు.
అలా చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. లక్షల్లో వ్యూస్, లైక్స్ వాటితో పాటే డబ్బు, పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకుంటున్నారు. కానీ ఇలాంటి ఫేక్ రీల్స్ చేస్తే విసి సజ్జనార్ హెచ్చరించినట్లు జైల్లో పడటం ఖాయం.
ఫేక్ న్యూస్ అలర్ట్!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 1, 2026
సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కక్కుర్తితో కొందరు ఎంతకైనా దిగజారుతున్నారు. మార్చి 14న లోక్ అదాలత్ సందర్భంగా ట్రాఫిక్ చలానాలపై రాయితీలు అంటూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఆశ్చర్యకరం ఏంటంటే.. ఈ ఫేక్ సమాచారం వీడియోలకు ఏకంగా లక్షల్లో వ్యూస్ రావడం.… pic.twitter.com/wrZ9znN6qe