ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమైనీని అమెరికా-ఇజ్రాయెల్ దళాలు కలిసి మట్టుపెట్టడంపై హైదరాబాద్‌లోని షియా మ,ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు హైదరాబాద్‌లో పలువురు నిరసనలు వ్యక్తం చేస్తూ అమెరికా-ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మజ్లీస్ అధినేత అసుదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ, “అమెరికా-ఇజ్రాయెల్ ఈవిధంగా చేయడాన్ని ఖండిస్తున్నాము. ముఖ్యంగా జెనీవాలో ఇరాన్-అమెరికా మద్య చర్చలు జరుగుతుండగా ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇరు దేశాల దళాలు దాడులు చేయడం సరికాదు. ఈ దాడిలో ఇరాన్ దేశంలో సుమారు 200 మంది చనిపోయారు. దానిలో పాఠశాల తరగతి గదుల్లో ఉన్న 108 బాలికలు కూడా ఉన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు ఈవిధంగా బరి తెగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అక్కడ అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు ఏవిధంగా వ్యవహరిస్తున్నాయో మన పొరుగునే పాకిస్తాన్ కూడా అచ్చం అలాగే వ్యవహరిస్తోంది,” అని ఓవైసీ ట్వీట్ చేశారు.