అప్పుడు లిక్కర్ మాఫీయా అన్నారు... ఇప్పుడు లేదంటున్నారు!

February 27, 2026


img

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ కోర్టు కల్వకుంట్ల కవితతో సహా 23మందికి క్లీన్ చిట్ ఇవ్వడంపై ఊహించినట్లే కాంగ్రెస్‌, బిజేపి, బీఆర్ఎస్‌ మూడు పార్టీలు భిన్నంగా అనూహ్యంగా స్పందించాయి. 

సీనియర్ కాంగ్రెస్‌ నాయకుడు జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “బిజేపికి ఇదొక పొలిటికల్ గేమ్‌. వాళ్ళు ఓ అవసరానికి ఒకలా  చేయోచ్చు. మరో అవసరానికి మరోలా  చేయోచ్చు. రాజకీయాలలో ఎల్లకాలం మిత్రులు, శత్రువులు ఉండరు.

ఢిల్లీలో లిక్కర్ మాఫియా నడుస్తోందని చెప్పింది బిజేపి (కేంద్ర ప్రభుత్వమే). కనుక ఆ మాఫియా గ్యాంగుని అరెస్ట్ చేసి లోపల వేస్తున్నామని చెప్పి వేసింది వాళ్ళే. ఇప్పుడు వాళ్ళే అందరికీ క్లీన్ చిట్ ఇచ్చి పంపించేస్తున్నారు. అంటే మాఫియా, గీఫియా లేదని చెపుతున్నారన్న మాట. కల్వకుంట్ల కవిత అరెస్టు, జైలు నుంచి విడుదల, ఇప్పుడీ కేసు కొట్టేయడం అన్నీ కూడా దాని పొలిటికల్ గేమ్‌లో భాగమే,” అని జగ్గారెడ్డి అన్నారు.       



Related Post