చావు భయంతో ఆత్మహత్య!!!

March 01, 2026
img

బెంగళూరు ఐటి కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న విద్యాజ్యోతి (29) ఓ జ్యోతిష్యుడు మాటలు విని భయంతో ఆత్మహత్య చేసుకుంది. ఇటీవలే ఆమె పెళ్ళి జరిగింది. అదీ.. తాను ప్రేమించిన యువకుడితోనే. పెళ్ళయిన తర్వాత వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటోంది. ఆమె జీవితం బాగున్నట్లే కదా?

కానీ త్వరలోనే చనిపొతావని, కనుక తొమ్మిది రోజుల పాటు ప్రతీరోజూ నిష్టగా పూజలు చేసి, చివరి రోజున మెళ్ళో తాళి తీసి అమ్మవారికి సమర్పించాలని జ్యోతిష్యుడు చెప్పాడు. అలా చేస్తే చావు తప్పించుకోవచ్చాని చెప్పాడో లేక సుమంగళిగా చనిపోవచ్చని చెప్పాడో తెలీదు.

కానీ అతను చెప్పినట్లే చేసి మొన్న శుక్రవారం పూజ తర్వాత మంగళసూత్రం తీసి అమ్మవారి పటం ముందు పెట్టి ఫ్యానుకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిని భయమనాలా... మూడ నమ్మకమనాలా... మానసిక సమస్య అనాలా? 

సదరు జ్యోతిష్యుడిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Related Post