అమెరికా-ఇరాన్ మద్య యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ కూడా అమెరికాతో కలిసి ఈ యుద్ధంలో పాల్గొంటోంది. ముందుగా ఇజ్రాయెల్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ మీద బాంబుల వర్షం కురిపించింది. దానికి అమెరికా జత కలిసింది. కనుక ఇరాన్ కూడా ధీటుగా స్పందిస్తూ ఇజ్రాయెలలో పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు ప్రయోగించింది.
అలాగే ఇరాన్ చుట్టూ ఉన్న సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, అబుదాబీ, ఖతార్, జోర్డాన్, యూఏఈలలో అమెరికా స్థావరాలపై ఒకేసారి క్షిపణులతో దాడులు చేసింది. దీంతో ఈ యుద్ధం ఎనిమిది గల్ఫ్ దేశాలకు విస్తరించినట్లయింది.
అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ప్రధానంగా ఇరాన్ అధ్యక్షుడు ఆయతుల్లా ఖోమైనీని మట్టుపెట్టడంపైనే దృష్టి పెడుతూ ఆయన అధికార నివాసంతో సహా ఆయన ఉండే రహస్య ప్రాంతాలపై క్షిపణులతో దాడులు చేస్తున్నాయి.
అయితే ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఈ యుద్ధాన్ని మీరు ప్రారంభించినా దీనిని మేమే ముగిస్తాము. అది చాలా భయానకంగా ఉంటుందని ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను హెచ్చరించింది.