ప్రముఖ జానపద గాయని మంగ్లీపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఓ మైక్రో ఫైనాన్స్ కంపెనీ సుమారు వందమంది సామాన్య ప్రజల వద్ద నుంచి రూ.10 కోట్లు కొట్టేసింది. మోసపోయిన ప్రజల తరపున సుబ్బారావు అనే న్యాయవాది కేసు వాదిస్తున్నారు.
మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఊడుగుల ఫోన్లు చేసి తనని రోడ్డుపై వాహనంతో గుద్దించి చంపేస్తామని బెదిరించారని సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఈవిధంగా కొన్ని హత్యలు జరిగినందున పోలీసులు వారిపై బీఎన్ఎస్ సెక్షన్స్ 351 (ఏ), 352 కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో వీరు నలుగురి పాత్ర ఏమిటి? వీరు నలుగురు కాకుండా రాజకీయ నాయకులు మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు.